హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నకిలీ కస్టమర్ కేర్లతో జాగ్రత్త

ASR: నకిలీ కస్టమర్ కేర్ నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అల్లూరి జిల్లా పోలీసులు సూచించారు. గూగుల్‌లో కనిపించే ప్రతి నంబర్‌ను నమ్మవద్దని, అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్‌లోని నంబర్లనే సంప్రదించాలన్నారు. ఓటీపీ, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పవద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని కోరారు.