కాకినాడ ఇంద్రపాలెంలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 12న ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక ప్రాణాలు కోల్పోగా, అంత్యక్రియలు పూర్తి చేశారు. మరణంపై అనుమానంతో బాలిక బాబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం పూర్తి చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థిని మృతిపై పోలీసుల దర్యాప్తు


