హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల వేళ పోలీసుల హై అలర్ట్!

GNTR: మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 26న జరగనున్న పోలింగ్ కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా, అదనపు బలగాల మోహరింపుతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు.