CTR: గుడిపాల మండలంలోని పెయనపల్లి, పానాటూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సర్పంచ్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ ఆదివారం పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, పోలీసుల విధులను సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ


