కృష్ణా: చిన ఓగిరాల మారుతి నగర్ శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో కార్తీక వన సమారాధన ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించారు. కార్తీక మాసంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అభినందనీయమని, ఇవి భక్తుల్లో చైతన్యాన్ని పెంచుతాయని ఆయన అన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు వెనిగండ్ల కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కార్తీక వన సమారాధనలో మాజీ ఎమ్మెల్సీ


