ప్రకాశం: పెద్దారవీడు మండలం బోడిరెడ్డిపల్లెలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి సమయంలో ఓ ఇంటి ఆవరణలోకి ప్రవేశించిన పెద్దపులి అక్కడ ఉన్న నీటిని తాగుతున్న దృశ్యాలను స్థానికుడు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. గ్రామంలో పెద్దపులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, పశువుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బోడిరెడ్డిపల్లెలో పెద్దపులి సంచారం


