హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

100 కుటుంబాలు టీడీపీలోకి చేరికలు

విజయనగరం జడ్పీ కార్యాలయంలో దత్తిరాజేరు మండలం గడసాం గ్రామం నుంచి సుమారు 100 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాయి. జడ్పీ చైర్‌పర్సన్ సిరి సహస్ర సమక్షంలో వారు టీడీపీ కండువాలు వేసుకున్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ తరఫున కలిసి పనిచేయాలని ఆమె కోరారు. ఇందులో మాజీ జడ్పీటీసీ గార తౌడు, మాజీ సర్పంచ్ నేతేటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.