హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజలు స్వేచ్ఛంగా ఓటువేసేలా చూడాలి'

SKLM: మందస మండలంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గిరిజన గ్రామాల ఓటర్లు పంచాయతీ ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వేసేలా చూడాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఒడిశా అధికారులు, పోలీసులు అభ్యర్థులను బెదిరించి పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించింది. గిరిజనుల భూములు, చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని, ప్రభుత్వం జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలని కోరింది.