TPT: మనుబోలు మండల పరిధిలోని చెన్నై జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. తిరుపతి నుంచి విజయవాడ వెళ్తుండగా ముందు టైరు పగలడంతో ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో బస్సులో 19 మంది ప్రయాణికులు ఉండగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు


