హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా గోసమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవం

AKP: మాడుగుల మండలం తాటిపర్తి పంచాయతీ జాజిమొగ్గలవారి కల్లాల వద్ద ఉన్న గోసమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పరిసర ప్రాంతాల రైతులు కుటుంబ సమేతంగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.