TPT: నారాయణవనం(M)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కైలాసకోన శివాలయాన్ని దర్శించుకుని బైక్పై తిరిగొస్తున్న ఇద్దరు అయ్యప్ప భక్తులను గోవిందప్ప నాయుడు కండ్రిగ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను రామకృష్ణాపురానికి చెందిన మణి, గొల్లపల్లికి చెందిన శీనుగా గుర్తించారు. మృతదేహాలను పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
అయ్యప్ప భక్తులపై మృత్యు పంజా


