ఇంటి రుణం చెల్లించినా ఏళ్ల తరబడి ఆస్తి పత్రాలు ఇవ్వకుండా ఓ వృద్ధుడిని ఇబ్బందులకు గురిచేసిన SBIకి భారీ షాక్ తగిలింది. బ్యాంకు సేవా లోపాన్ని పరిగణించిన వినియోగదారుల కమిషన్, బాధితుడికి రోజుకు రూ.5,000 చొప్పున 7 ఏళ్లు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ జరిమానా రూ.1.35 కోట్లకు పైగా చేరనుండటం బ్యాంకింగ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. 45 రోజుల్లోగా ఈ ఆదేశాలు అమలు చేయాలని కమిషన్ స్పష్టం చేసింది.
వ్యాపారం
SBIకి షాక్.. రోజుకు రూ.5 వేల జరిమానా!


