12 ఏళ్ల మోదీ పాలనలో ప్రతి ఈశాన్య రాష్ట్ర రాజధానిని రైలు, విమాన సేవలతో అనుసంధానించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 80 ఏళ్లలో లేని విధంగా రోడ్లు, రైలు, విమాన, జలమార్గాల విస్తరణ మోదీ హయాంలోనే జరిగిందన్నారు. ఢిల్లీ, ఈశాన్యం మధ్య భౌతిక దూరం తగ్గించడమే కాకుండా, ప్రజల హృదయాల మధ్య ఉన్న భావోద్వేగ దూరాన్ని తొలగించడమే మోదీ అందించిన అత్యంత గొప్ప కానుకని కొనియాడారు.
వార్తలు
’మోదీ.. భౌతిక, భావోద్వేగ దూరాన్ని తగ్గించారు’


