హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏసీ బిగిస్తూన్న ప్రమాదంలో మెకానిక్‌కు తీవ్ర గాయాలు

NTR: నందిగామకు చెందిన షేక్ ఫయాజ్ అనే ఏసీ మెకానిక్ గన్నవరంలో ఏసీ బిగిస్తుండగా నవంబర్ 21న రెండో అంతస్తు నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో పెద్దఔట్‌పల్లి సిద్ధార్థ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యానికి అధిక ఖర్చు అవుతుండటంతో నిరుపేద కుటుంబానికి చెందిన ఫయాజ్ కుటుంబ సభ్యులు దాతల ఆర్థిక సహాయం కోరుతున్నారు.