AKP: పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పాయకరావుపేట పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సీఐ ఎం. వినోద్ బాబు ఆధ్వర్యంలో ఎస్సైలు పురుషోత్తం, ఆలీ, సన్యాసిరావు, పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ బలగాలు పాల్గొన్నారు. ఇందిరా కాలనీ నుంచి వై జంక్షన్ వరకు కవాతు సాగింది. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సీఐ విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
పాయకరావుపేటలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్


