హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ మద్యం విక్రయాలపై పోలీసుల దాడి

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై కల్లూరు పోలీసులు దాడి చేశారు. సరస్వతమ్మ బెల్ట్ షాపులో మద్యం విక్రయిస్తున్న సురేంద్ర అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 150 మద్యం సీసాలు, 34 బీర్ సీసాలు కలిపి మొత్తం 184 సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.30 వేలుగా అంచనా వేశారు.