హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అవనిగడ్డలో జనసేన పార్టీలో చేరికలు

కృష్ణా: అవనిగడ్డలో అందరికీ సుపరిచితుడైన అవనిగడ్డ శివ జనసేనలో చేరారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆయనకు వెంకట్రామ్ జనసేన కండువాతో స్వాగతం పలికారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామీణ అభివృద్ధికి బాటలు వేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ప్రజలు గుర్తించారన్నారు.