హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ అభ్యర్థులకు మద్దతు తెలిపిన ఉషశ్రీ చరణ్

SS: సోమందేపల్లి మండలంలోని పలు పంచాయతీల వైసీపీ సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పాల్గొన్నారు. ఆదివారం సోమందేపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి డీసీ అశోక్ కుమార్, గుడిపల్లి అభ్యర్థి కడపల్లి శ్రీరాములు, నాగినాయనచెరువు అభ్యర్థి మహాలక్ష్మి నామినేషన్ల దాఖలుకు ఆమె హాజరై మద్దతు తెలిపారు.