హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మరోసారి కేతిరెడ్డి తీవ్ర ఆరోపణలు

ATP: తన హత్యకు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కుట్ర పన్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. తన నివాసంపై 500 మందితో దాడి చేయించారని మండిపడ్డారు. పెట్రోల్ బాంబులను క్రాకర్స్‌గా పేర్కొంటూ పోలీసులు కేసును తప్పుదోవ పట్టించారని విమర్శించారు. డీఎస్పీ చంద్రశేఖర్ జేసీ తొత్తులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.