హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైస్ ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ..!

ELR: జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 32 వార్డులకు గానూ టీడీపీ 20, జనసేన 6, బీజేపీ 1 స్థానాలతో కూటమి ఘనవిజయం సాధించగా, వైసీపీ 3, స్వతంత్రులు 2 వార్డుల్లో గెలుపొందారు. ఛైర్‌పర్సన్‌గా రొంగల అనూష భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. కాగా, రేపు జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవంలో వైస్ ఛైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందనే అంశంపై ఉత్కంఠతో నెలకొంది.