హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం

కోనసీమ: కొత్తపేటలో కూటమి టీడీపీ సర్పంచ్ అభ్యర్థి యల్లమెల్లి సందీప్ ఎన్నికల ప్రచారం రెండో రోజు ఆదివారం ఉత్సాహంగా సాగింది. ఆర్యవైశ్య సత్రం నుంచి పినిపేవారి పేట, భవాని కాలనీ, గణేష్ కాలనీ, మార్కెట్ మీదుగా కమ్మిరెడ్డిపాలెం నుంచి మారుతి సెంటర్ వరకు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.