హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమవరంలో వృద్ధాశ్రమానికి ఇన్వర్టర్ అందజేత

W.G: భీమవరం బీవీ రాజు పార్క్ ఎదురుగా ఉన్న ప్రేమాలయ వృద్ధాశ్రమానికి సినీ హీరో ప్రభాస్ అభిమాని ఉమర్ రూ.75 వేల విలువైన ఇన్వర్టర్‌ను అందించారు. భీమవరంలోని వివిధ సినీ హీరోల అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. వృద్ధాశ్రమానికి అవసరమైన ఇన్వర్టర్‌ను అందించడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. సమాజ సేవ చేయడం మానవత్వానికి నిదర్శనమన్నారు.