కోనసీమ: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయ నిత్య అన్నదాన పథకానికి ఆదివారం కాకినాడకి చెందిన మంచిరాజు లక్ష్మీపతి, సూర్యకాంతం వారి కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి శేష వస్త్రములతో సత్కరించి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
విఘ్నేశ్వర స్వామి అన్నదాన ట్రస్టుకు భారీ విరాళం


