హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిజాయితీ చాటుకున్న టిప్పర్ డ్రైవర్

TPT: రామచంద్రాపురం మండలం నడవలూరు మార్గంలో శ్రీహరి అనే వ్యక్తి పర్సు పోగొట్టుకున్నారు. అదే దారిలో వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ సురేంద్రబాబు పర్సును గుర్తించి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. విచారణలో పర్సు యజమానిని గుర్తించిన పోలీసులు శ్రీహరిని స్టేషన్‌కు పిలిపించి డ్రైవర్ చేతుల మీదుగా పర్సును అందజేశారు. సురేంద్రబాబు నిజాయితీని పోలీసులు, స్థానికులు అభినందించారు.