హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మఒడి సంస్థకు బియ్యం అందజేత

కడపలోని అమ్మఒడి రెవెన్యూ సేవా సహవాస సంస్థలోని అనాథ పిల్లల కోసం సుండుపల్లె తహసీల్దార్ వేణుగోపాల్, రెవెన్యూ సిబ్బంది ఆరు బియ్యం ప్యాకెట్లను అందజేశారు. పేద, నిరుపేదలకు అండగా నిలుస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.