అన్నమయ్య: రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం జిల్లా పరిషత్ ఛైర్మన్ ప్రసాద్ బాబును మాసాపేట యూత్ సభ్యులు ఆత్మీయంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన ఆయనకు కేక్ కట్ చేయించి, పూలమాలలు వేసి,శాలువా కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో అన్నమయ్య జిల్లా మరింత అభివృద్ధి సాధించాలని యువత ఆకాంక్షించింది.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ ఛైర్మన్ ప్రసాద్ బాబుకు ఘన సత్కారం


