హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి ఛాంపియన్‌కు స్పీకర్ ప్రశంసలు

AKP: రాష్ట్రస్థాయి అండర్-13 సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ యలమంచిలి పృధ్వి మణికంఠ ఆదివారం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మావతిని కలిశారు. తిరుపతి పోటీల్లో సింగిల్స్‌లో ప్రథమ, డబుల్స్‌లో ద్వితీయ స్థానం సాధించిన మణికంఠను స్పీకర్ అభినందించి, జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.