JGL: జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లి-భాగ్య నగర్ స్ట్రీట్ 7వ వార్డులో పదేళ్లుగా రోడ్డు, మురుగు కాలువల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారి గుంతలమయంగా మారగా, మురుగు నీరు నిలిచి దుర్వాసన, దోమల బెడద పెరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6,7వ వార్డుల కౌన్సిలర్ల మధ్య సమన్వయ లోపంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు.
తెలంగాణ
ఇక్కడ పదేళ్లుగా ఇదే పరిస్థితి..!


