హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓయూ అభివృద్ధికి రూ.480 కోట్లు

HYD: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తొలి దశ అభివృద్ధి పనులకు రూ.480 కోట్లతో టెండర్లు పిలిచారు. వసతి గృహాలు, ఆధునిక వంటశాలలు, డైనింగ్ హాళ్లకు రూ.270 కోట్లు, అకాడమిక్ బ్లాకులు, ఆర్‌అండ్‌డీ భవనానికి రూ.210 కోట్లు కేటాయించారు. బిడ్ల దాఖలుకు డిసెంబర్ 11 చివరి తేదీ. సీఎం ప్రకటించిన రూ.వెయ్యి కోట్ల ప్యాకేజీలో ఇది భాగమని వీసీ కుమార్ మొలుగారం తెలిపారు.