హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన ఏఐసీసీ ఇంఛార్జ్ బీఎం సందీప్‌కు ఘన స్వాగతం

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ కాంగ్రెస్ నూతన ఏఐసీసీ ఇంఛార్జ్ బీఎం సందీప్‌‌కు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా హైదరాబాద్ విచ్చేసిన ఆయనకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.