MNCL: మందమర్రి వెళ్లే మెయిన్ రోడ్ కృష్ణ కాలనీ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో స్పందించిన మంచిర్యాల 108 సిబ్బంది EMT సత్యనారాయణ, పైలట్ ఏవీ రావు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు


