హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంగపేట కాంగ్రెస్ కమిటీలు రద్దు

MLG: మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ కమిటీలను రద్దు చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆదివారం ప్రకటించారు. మంత్రి సీతక్క సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా మండల, గ్రామ కమిటీలతో పాటు అనుబంధ సంఘాల కమిటీలను పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి నూతనంగా ప్రకటిస్తామని వెల్లడించారు.