కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పేసర్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. 2 ఇన్నింగ్స్‌ల్లోనూ తొలి ఓవర్‌లో వికెట్ పడగొట్టాడు. కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తొలి ఓవర్‌లోనే ఔట్ చేశాడు. దీంతో ఒకే టెస్టులో 2 ఇన్నింగ్స్‌ల తొలి ఓవర్లలో వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. గతంలో శ్రీశాంత్ (2006), జహీర్ ఖాన్ (2007) ఈ ఘనత సాధించారు.
క్రీడలు
IND vs NZ: బుమ్రా అరుదైన రికార్డు


