హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

జిమ్‌కి వెళ్తున్నారా..?

జిమ్‌కి వెళ్లేవారు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం మొదలుపెట్టే ముందు 10 నిమిషాల పాటు వార్మప్ చేయడం వల్ల కండరాల నొప్పులు, గాయాల ప్రమాదం తగ్గుతుంది. వర్కౌట్ సమయంలో తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ఒకేసారి ఎక్కువ బరువులు ఎత్తకుండా, ట్రైనర్ పర్యవేక్షణలో నెమ్మదిగా సాధన పెంచుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.