హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కారం ఎక్కువగా తింటున్నారా?

మసాలా, కారం ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఇష్టపడేవారు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అధికంగా, తరచూ కారం తినడం వల్ల జీర్ణ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కడుపునొప్పి, గ్యాస్, ఆమ్లత్వం, వాంతులు, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చని చెబుతున్నారు. అల్సర్, ఐబీఎస్ సమస్యలున్నవారు మసాలా ఆహారానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.