హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కూరల్లో ఉప్పు ఎక్కువగా వేస్తున్నారా..?

ఆహారంలో ఉప్పును అతిగా తీసుకోవడం వల్ల రక్తపోటు విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలపై ఒత్తిడి పెరిగి వాటి పనితీరు క్రమంగా దెబ్బతింటుంది. శరీరంలో నీరు నిలిచిపోయి కాళ్లు, ముఖం వాపులకు గురవుతాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో ఉప్పు వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడం మంచిది.