హైదరాబాద్: 28°C
వార్తలు

ఎగుమతుల్లో 68 శాతం వృద్ధి: సీఎం రేవంత్

TG: గత మూడేళ్లలో తెలంగాణ ఎగుమతులు 68 శాతం పెరగడంపై సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏరోస్పేస్, ఇంజినీరింగ్ ఎగుమతులు భారీగా వృద్ధి చెందుతున్నాయని 'X'లో పోస్ట్ చేశారు. మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో వృద్ధి, అభివృద్ధి వికేంద్రీకరణకు నిదర్శనమన్నారు. ఇది కేవలం ఆరంభమేనని వ్యాఖ్యానించారు. TG రైజింగ్ విజన్‌తో ఆర్థిక కార్యకలాపాలు మరింత పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు.