హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

చలికాలంలో స్నానం ఎంతసేపు చేయాలి?

చలికాలంలో స్నానాన్ని 5–10 నిమిషాల్లోనే ముగించాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు స్నానం చేయడం వల్ల చర్మంలోని సహజ నూనెలు తొలగిపోయి చర్మం పొడిబారడం, దురద వంటి సమస్యలు వస్తాయని తెలిపారు. చర్మాన్ని తేమగా ఉంచేందుకు మాయిశ్చరైజర్ రాసుకోవాలని సూచించారు. పగిలిన పాదాలను ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిలో ముంచి, తడి తుడిచి క్రీమ్ రాయాలన్నారు. మీ చలికాలం చిట్కా ఏంటి?.