హైదరాబాద్: 28°C
క్రైమ్

ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురు మృతి

గుజరాత్‌ కచ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ట్రక్కు-కారు ఢీకొని ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురు మృతిచెందారు. జాతీయ రహదారిపై ట్రక్కు వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు మరణించారు. మృతుల్లో 3 నెలల పసిపాప ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా ఉత్తరాఖండ్‌ గర్వాల్ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.