WGL: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మెయిన్ ల్యాబ్లో సీబీపీ పరీక్షల నిర్వహణ రోగులకు ఇబ్బందిగా మారింది. వారం రోజులుగా రెండు యంత్రాల్లో ఒకటి పనిచేయకపోవడంతో మరో యంత్రంపై పని భారం పెరిగింది. ఫలితంగా నివేదికలు ఆలస్యమవుతున్నాయి. కేఎంసీ, సీకేఎం, ప్రాంతీయ నేత్ర వైద్యశాల రోగులు కూడా ఇక్కడికే వస్తుండటంతో సమస్య తీవ్రమైంది. పలువురు ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయిస్తున్నారు.
తెలంగాణ
ఎంజీఎంలో సీబీపీ పరీక్షలకు సాంకేతిక అంతరాయం


