హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెరుగుతున్న బియ్యం ధరలు

VKB: తాండూర్, పరిగి, యాలాల, పెద్దముల్, కొడంగల్ మండలాల్లో గత సంవత్సరంలో వరి పంట ఆశించిన స్థాయిలో పండటంతో సామాన్యులకు బియ్యం ధరలు అందుబాటులో ఉండేవి. ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక, బోరుబావుల్లో నీరు లేకపోవడంతో వరి పంట భారీగా నష్టపోయింది. దీంతో బియ్యం క్వింటాల్ ధర రూ.8000 వేలకు చేరి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది.