ASF: వాంకిడి మండలంలోని బంబారా ఆశ్రమ పాఠశాలలో నెల రోజులుగా మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదు. దీంతో విద్యార్థులు సాధారణ నల్లా నీటినే తాగాల్సిన పరిస్థితి. మధ్యాహ్న భోజనం అనంతరం నల్లా వద్దకు వెళ్లి తమ పళ్లేలను శుభ్రం చేసుకుని, తిరిగి నీటిని తాగుతున్నారు. అపరిశుభ్రమైన నీటిని తాగడం వల్ల అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలంగాణ
సాధారణ నల్లా నీటినే తాగుతున్న విద్యార్థులు


