PDPL: ధర్మారం మండలంలో ఆదివారం ఉదయం పొగమంచు కమ్ముకుంది. తెల్లవారుజామున దట్టంగా అలుముకున్న మంచుతో రహదారులు కనిపించకుండా మారాయి. దీంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో నెమ్మదిగా ప్రయాణించాల్సి వచ్చింది. ఉదయం వేళ మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సి వచ్చింది.
తెలంగాణ
VIDEO: ధర్మారంలో దట్టమైన పొగమంచు


