SS: కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో క్షీరాబ్ధి ద్వాదశి వేడుకలు శనివారం వైభవంగా నిర్వహించారు. రాత్రి తులసి బృందావనోత్సవం, విశేష పూజలు, నివేదనలు జరిపారు. స్వామివారి ఉత్సవమూర్తులను వెండిరథంపై ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం ఉంజల్ సేవ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వెండిరథంపై లక్ష్మీనరసింహుడి ఊరేగింపు


