వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాను గత రెండు రోజులుగా దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. తీవ్రమైన చలితో ప్రజలు వణికిపోతున్నారు. పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భూపాలపల్లి జిల్లా గోరుకొత్తపల్లి మండల కేంద్రంలో పొగమంచు తీవ్రతకు అద్దం పడుతున్న దృశ్యాలు ఇవి. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ
పొగమంచుతో వణుకుతున్న ఉమ్మడి వరంగల్ జిల్లా


