ASF: ఆసిఫాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలకు చెందిన దుర్గం వర్షిత్, డొంగ్రే వెంకటేశ్ జాతీయ స్థాయి జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. పంజాబ్ రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి జరిగే జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నట్లు ప్రిన్సిపల్ అబ్దుల్ రహీం తెలిపారు. ఎంపికైన వారిని పిఈటి ప్రసాద్, సాఫ్ట్ బాల్ సంఘం సెక్రటరీ కిరణ్ కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు.
తెలంగాణ
జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలకు గురుకుల విద్యార్థులు


