హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంధంతో ఆకృతి గీసి.. అంజన్న నిజరూప దర్శనం

JGL: కొండగట్టులో భక్తులకు అంజన్న అరుదైన నిజరూప దర్శనం కలిగింది. చందనం తొలగించి అర్చకులు స్వామివారి అసలు రూపాన్ని భక్తులకు చూపించారు. అనంతరం గంధంతో ఆకృతిని తీర్చిదిద్దడంతో స్వామివారి నల్లని రూపం స్పష్టంగా కనిపించింది. చేతులు జోడించి నమస్కరిస్తూ ఉత్తర దిశగా వెళ్తున్నట్లున్న స్వామివారి రూపం, తలపై నరసింహుడి ఆకృతి భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి.