హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగిత్యాలలో వైజ్ఙానిక నమూనాలు రాష్ట్ర స్థాయికి ఎంపిక

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాత ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన శనివారం ముగిసింది. వివిధ విభాగాల్లో 460 నమూనాలు ప్రదర్శించగా, ఇన్‌స్పైర్ విభాగంలో 13, బాల వైజ్ఞానిక ప్రదర్శనలో 14 నమూనాలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. ముగింపు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రసూనాంబ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సంగనభట్ల దినేష్, పాల్గొన్నారు.