హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిమ్మప్ప ఆలయంలో కార్తీకమాసం పూజలు

GDWL: అయిజ పట్టణ శివారులో వెలసిన కట్ట కింద తిమ్మప్ప స్వామి ఆలయంలో శనివారం విశేష పూజలు జరిగాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు స్వామి స్వయంభువును కోనేరు జలాలతో అభిషేకించి అర్చన, ఆకు పూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక జ్యోతులు వెలిగించి స్వామిని దర్శించుకున్నారు.