BHPL: మల్హర్ రావు మండలంలోని తాడిచర్ల గ్రామానికి చెందిన సుదర్శన్, మల్లారం గ్రామానికి చెందిన రియాజ్ గంజాయి సేవించినట్లు నిర్ధారణ కావడంతో కొయ్యూరు పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. శనివారం వారిని అదుపులోకి తీసుకుని పరీక్షించగా గంజాయి సేవించినట్లు తేలిందని ఎస్సై మహేందర్ కుమార్ తెలిపారు. యువకులు గంజాయికి అలవాటు పడితే పోలీసులను సంప్రదించాలన్నారు.
తెలంగాణ
గంజాయి సేవించిన ఇద్దరు యువకులపై కేసు


